బూరుగుపల్లిలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు

ఆటపాటలతో కోలాహలంగా సాగిన బతుకమ్మ సంబరాలు మహిళల కోసం ప్రత్యేక లైటింగ్, తాగునీటి సదుపాయాలు భక్తిశ్రద్ధలతో గౌరమ్మకు వీడ్కోలు పలికిన గ్రామస్తులు చిత్రంలో: సద్దుల బతుకమ్మతో సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ కుటుంబం మరియు గ్రామ ప్రముఖులు  సిరిసిల్ల స్టాప్ రిపోర్టర్ తెలంగాణ అడ్డా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రామ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పే ఈ వేడుకల కోసం స్థానిక సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ ముందస్తుగా అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేశారు. గ్రామంలోని మహిళలు, యువతులు, చిన్నపిల్లలు రంగురంగుల పూలతో పేర్చిన అందమైన బతుకమ్మలతో...