జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయం సిట్ ద్వారా విచారణ జరిపించాలి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: దెబ్బతిన్న ఏక్ ధమ్ న్యూస్ జర్నలిస్టులను కరీంనగర్లో పరామర్శించిన బీఆర్ఎస్ నేత పోలీసు గుండాయిజంపై డీజీపీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీత రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులే గుండాలుగా ప్రవర్తిస్తూ, నేరాలకు పాల్పడుతున్నారని.. చేయని నేరానికి జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అత్యంత పాశవికంగా హింసించారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్లో చికిత్స పొందుతున్న బాధిత జర్నలిస్టులను సోమవారం ఆయన పరామర్శించి, బాధితులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఘటన వివరాలు మరియు ప్రధాన...