బతుకమ్మ వేడుకల నిర్వహణలో బీజేపీ పాలకవర్గం విఫలం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: మహిళలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి 66 డివిజన్లలో లైటింగ్, మైకులు లేక చిమ్మచీకట్లో అల్లాడిన మహిళలు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో బతుకమ్మ వేడుకల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆడపడుచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన బీజేపీ పాలకవర్గం తరుపున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయకపోవడం నగర మహిళలను, బతుకమ్మ తల్లిని అవమానించడమేనని మండిపడ్డారు. సోమవారం కరీంనగర్‌లోని మంకమ్మతోటలోగల తన డివిజన్...