తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం దసరా పండుగ ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలి: పొలాస నరేందర్

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ: చెడుపై మంచి, అన్యాయంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్, ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ నాయకుడు పొలాస నరేందర్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే విజయదశమి పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులు, పార్టీ శ్రేణులు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేయోభిలాషులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పొలాస నరేందర్ మాట్లాడుతూ.. దసరా పండుగ తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని, సంప్రదాయాలను ప్రతిబింబించే అత్యంత పవిత్రమైన,...