రైతుల పక్షాన మూడు డిమాండ్లు చేస్తున్నాం: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
పంటలు వేయొద్దని చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలి తెలంగాణ అడ్డా ప్రతినిధి కరీంనగర్ బ్యూరో: సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపురం గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన పంటలను ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటలు ఎండిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోతున్న రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రైతులను పంటలు వేయవద్దని చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు వ్యవసాయం చేయవద్దని చెప్పలేదని అన్నారు. రైతులు వ్యవసాయం మానేయాలని చెబుతున్న...