స్తంభంపల్లిలో ఘనంగా ‘అమృత్ సరోవర్’ కార్యక్రమం పాఠశాల ఆవరణలో శ్రమదానం – మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

జల వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ నీటిని పొదుపుగా వాడాలని ప్రతిజ్ఞ చేసిన గ్రామస్తులు సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తెలంగాణ అడ్డా: భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని, జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని స్తంభంపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ‘అమృత్ సరోవర్’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో పరిశుభ్రత మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శ్రమదానం ద్వారా తొలగించి శుభ్రం చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు,...