అభివృద్ధిని చూసి ఓర్వలేకనే దుష్ప్రచారాలు...

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్ తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉనికి కోల్పోతున్నా మనే భయంతోనే ధర్నాలు, రాస్తారోకోల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్ విమర్శించారు,శుక్రవారం మణుగూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని వివిధ వార్డుల్లో పాదయాత్రలు చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటు న్నారని తెలిపారు.సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు.ఎమ్మెల్యే ఇచ్చిన...