కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా జలాలుద్దీన్ అక్బర్ బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: నూతన DMWOని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకులు పదేళ్ల తర్వాత మైనారిటీ అధికారి నియామకంపై హర్షం మంత్రులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు కరీంనగర్ జిల్లా నూతన మైనారిటీ సంక్షేమ అధికారిగా (DMWO) జలాలుద్దీన్ అక్బర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకులు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా అదనపు డీఆర్ఓ (In-charge Adl. DROs)లకు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్...