ఒగ్గు పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కరీంనగర్‌లో 'తెలంగాణ చౌక్ నుండి కళాభారతి' వరకు భారీ ర్యాలీ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ ప్రత్యేక కార్పొరేషన్, రూ.5,000 పింఛన్, పోలీసుల వేధింపులు ఆపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ తెలంగాణ శ్రీ మల్లికార్జున స్వామి యాదవ ఒగ్గు పూజార్ల సుదీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరంలో సోమవారం 'శ్రీ మల్లికార్జున స్వామి యాదవ ఒగ్గు పూజారుల సంక్షేమ సంఘం' ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కళాభారతి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి...