బీరంగూడ డివిజన్‌లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. పార్టీ అభివృద్ధికి శ్రమిస్తా: ఈర్ల రాజు ముదిరాజ్

జిన్నారం మండల్, తెలంగాణ అడ్డా ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండలం పరిధిలోని బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఈర్ల రాజు ముదిరాజ్‌ను కిష్టారెడ్డిపేట్‌లోని రెయిన్బో మెడోస్ కాలనీ సొసైటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ సొసైటీ నాయకులు నూతన బాధ్యతలు చేపట్టిన ఈర్ల రాజు ముదిరాజ్‌ను అభినందించారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ తనపై అభిమానం చూపించి సన్మానించిన రెయిన్బో మెడోస్ కాలనీ సొసైటీ నాయకులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. బీరంగూడ...