కరీంనగర్ టు శబరిమల ‘మహా పాదయాత్ర’ ఘనంగా ప్రారంభం
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో ఇరుముడి పూజలు.. జెండా ఊపి యాత్రను ప్రారంభించిన కావేటి పరమేశ్వర గురుస్వామి 45 రోజుల పాటు 6 రాష్ట్రాల గుండా సాగనున్న యాత్ర.. డిసెంబర్ 12న శబరిమల సన్నిధాన దర్శనం కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ‘కరీంనగర్ టు శబరిమల’ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర బుధవారం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ప్రారంభమైంది. శ్రీ గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ గారి వేదమంత్రోచ్ఛారణల మధ్య అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకుని యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహా...