మాదకద్రవ్యాల నివారణపై ఉక్కుపాదం కరీంనగర్ కమిషనరేట్‌లో NDPS కేసులపై ఈగిల్ టీమ్ ఎస్పీ, సీపీ ఉన్నత స్థాయి సమీక్ష

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: నిందితులకు బెయిల్, రెమిషన్ రాని విధంగా కఠిన చట్టాలు ప్రయోగించాలి: ఈగిల్ టీమ్ ఎస్పీ గిరిధర్ -కరీంనగర్‌ను 'డ్రగ్ ఫ్రీ' కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతాం: సీపీ గౌష్ ఆలం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసులపై గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా విచ్చేసిన తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్ మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ల సంయుక్త ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఎన్‌డిపిఎస్ కేసుల దర్యాప్తు పురోగతిపై సమగ్ర సమీక్ష చేపట్టారు.సమావేశంలో...