ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకుల డిమాండ్
విశ్వకర్మలకు సామాజిక న్యాయం కల్పించాలి కరీంనగర్, తెలంగాణ అడ్డా: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం కల్పించాలని, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మశ్రీ పాములపర్తి వేణుగోపాల చారి అధ్యక్షతన శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన సంఘం సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలకు చెందిన సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొని విశ్వకర్మ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేసి...