రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 30 తెలంగాణ అడ్డా ఎలినో పరిస్థితులను ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ ధ్యేయంగా చిత్తశుద్ధితో కార్యాచరణ రూపొందిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చిన్న బొంకూర్, పేరుకపల్లి, రెబ్బల్దేవ్ పల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో వడ్లకు ఉన్న డిమాండ్ ను ఆసరా చేసుకొని మధ్య దళారులు రైతులను మోసం చేసే...