Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అల్ఫోర్స్ వైస్ అడ్మినిస్ట్రేటర్ ప్రణీత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ నరేందర్ రెడ్డి

Author Mohammad azeem | 06 Sep 2026, 06:10 PM |
అల్ఫోర్స్ వైస్ అడ్మినిస్ట్రేటర్ ప్రణీత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ నరేందర్ రెడ్డి

అల్ఫోర్స్ వైస్ అడ్మినిస్ట్రేటర్ ప్రణీత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ నరేందర్ రెడ్డి

శోకసంద్రంలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా

ఇవి కూడా చదవండి

కరీంనగర్‌లోని అల్ఫోర్స్ మెయిన్ క్యాంపస్ వైస్ అడ్మినిస్ట్రేటర్ ప్రణీత భర్త ఎం. రఘునందన్ రావు ఆకస్మిక మృతిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భర్తను కోల్పోయి విషాదంలో ఉన్న ప్రణీత కుటుంబాన్ని ఆయన స్వయంగా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడం తీరని లోటని పేర్కొంటూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బాధిత కుటుంబానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల తరఫున ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు, భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటామని నరేందర్ రెడ్డి భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.