Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జగ్రావుపల్లి గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలోఅంగన్వాడీ కేంద్రం సందర్శన

Author TELANGANA ADDA NEWS | 22 Sep 2026, 12:08 PM | advt.
జగ్రావుపల్లి గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలోఅంగన్వాడీ కేంద్రం సందర్శన

జగ్రావుపల్లి గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలోఅంగన్వాడీ కేంద్రం సందర్శన

బోయిన్పల్లి తెలంగాణ అడ్డా, సెప్టెంబర్ 22:
జగ్రావుపల్లి గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, కేంద్రంలో చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలను పరిశీలించారు.

జగ్రావుపల్లి గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలోఅంగన్వాడీ కేంద్రం సందర్శన - Additional Image

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఫ్యాన్లు, బల్బులు తదితరాలను పరిశీలించారు. చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పాలు, గుడ్లు, పోషకాహారాన్ని షెడ్యూల్ ప్రకారం అందించాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువును క్రమం తప్పకుండా నమోదు చేస్తూ వారి ఎదుగుదలను పర్యవేక్షించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రం సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, పోషణపై తల్లిదండ్రులు, పేరెంట్ కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుద్దాలమదు మరియు ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు ఏఎన్ఎం అంగన్వాడి టీచర్ పిల్లలు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది