Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఎక్కడ? కోరెము–బూరుగుపల్లి రహదారి పనులపై వాహనదారులు, గ్రామస్తుల ఆందోళన

Author TELANGANA ADDA NEWS | 08 Sep 2026, 03:29 PM |
రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఎక్కడ?  కోరెము–బూరుగుపల్లి రహదారి పనులపై వాహనదారులు, గ్రామస్తుల ఆందోళన

రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఎక్కడ?

కోరెము–బూరుగుపల్లి రహదారి పనులపై వాహనదారులు, గ్రామస్తుల ఆందోళన

బోయిన్పల్లి మండలం, సెప్టెంబర్ 8 (తెలంగాణ అడ్డా):

బోయిన్పల్లి నుంచి నల్లగొండ గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, కోరెము నుంచి బూరుగుపల్లి గ్రామం వరకు చేపడుతున్న రోడ్డు పనులపై వాహనదారులు, స్థానిక గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కోరెము–బూరుగుపల్లి మధ్య రహదారి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పాత రోడ్డును తొలగించి, నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించాల్సి ఉండగా.. కొన్ని చోట్ల మధ్యలో రోడ్డును పూర్తిగా తొలగించకుండానే ప్యాచ్ వర్క్ తరహాలో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు.

ఇలాంటి పనుల వల్ల రహదారి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, కొద్ది కాలానికే రోడ్డు మళ్లీ దెబ్బతినే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

సంబంధిత అధికారులు రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు తేలితే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, నాణ్యతతో కూడిన రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ రహదారి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి నాణ్యతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీ చేపట్టాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు.