Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

Author Mohammad azeem | 08 Sep 2026, 04:15 PM |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ
అడ్డా:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌తో పాటు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీఎన్ఎస్ సెక్షన్ 351, 351(3), సెక్షన్ 196(1), సెక్షన్ 61 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ సాధకులు, తెలంగాణ అభివృద్ధి ప్రధాత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతూ, వెయ్యి డప్పుల ర్యాలీ చేయిస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.