Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నారాయణపేట సబ్-రిజిస్ట్రార్, ప్రైవేట్ వ్యక్తి ఏసీబీకి పట్టుబట్టుడు

Author Mohammad azeem | 08 Sep 2026, 07:29 PM |
నారాయణపేట సబ్-రిజిస్ట్రార్, ప్రైవేట్ వ్యక్తి ఏసీబీకి పట్టుబట్టుడు

నారాయణపేట బ్యూరో / తెలంగాణ అడ్డా:
నారాయణపేట జిల్లా సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II (AO-1), ఇంటి భోజనం మెస్ యజమాని మరియు ప్రైవేట్ వ్యక్తి అయిన శ్రీ కమ్మరి నరేష్ (A-2) లపై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది. బాధితుని ఇంటి రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్: 4723/2026) పూర్తి చేయడానికి అధికారిక అనుకూలత చూపడం కోసం AO-1, A-2 ద్వారా 2026 జూలై 18 న రూ. 50,000 లంచం డిమాండ్ చేసి ముందస్తుగా తీసుకున్నారు. ఆ తర్వాత మిగతా బ్యాలెన్స్ మొత్తం రూ. 40,000 కూడా డిమాండ్ చేశారు.
AO-1 మరియు A-2 తమ అధికారిక విధులను సక్రమంగా నిర్వహించకుండా అక్రమ లబ్ధి పొందాలని ప్రయత్నించినందున, వారిని నాంపల్లిలోని గౌరవనీయ I వ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి (SPE & ACB కేసుల కోర్టు) ఎదుట జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి.