Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

టేకుమట్ల పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

Author Mohammad azeem | 09 Sep 2026, 02:06 PM |
టేకుమట్ల పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి బ్యూరో / తెలంగాణ అడ్డా:
టేకుమట్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్టేషన్‌లో సీసీ కెమెరాల పనితీరును, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజా భద్రతే ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.