Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నూతనంగా నియమితులైన ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్‌ను సత్కరించిన ‘అల్ఫోర్స్’ నరేందర్ రెడ్డి

Author Mohammad azeem | 12 Sep 2026, 07:48 PM |
నూతనంగా నియమితులైన ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్‌ను సత్కరించిన ‘అల్ఫోర్స్’ నరేందర్ రెడ్డి

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
ఇటీవల కాలంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నియమింపబడిన మహమ్మద్ ఇమ్రాన్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘అల్ఫోర్స్’ డా. వి. నరేందర్ రెడ్డి ఆత్మీయంగా సత్కరించారు.
కళాశాల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఎదుగుతూ ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న ఇమ్రాన్‌ను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడాలని, సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి సూచించారు.