Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మన్నె క్రిశాంక్ అరెస్ట్. బీఆర్ఎస్ శ్రేణుల భారీ ఆందోళన

Author Mohammad azeem | 14 Sep 2026, 11:37 PM | Politics, TELANGANA
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మన్నె క్రిశాంక్ అరెస్ట్. బీఆర్ఎస్ శ్రేణుల భారీ ఆందోళన

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కేటీఆర్ పీఆర్వో, పీఏలపై జరిగిన దాడి యత్నం ఘటనకు సంబంధించి సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీస్ స్టేషన్‌లో తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కేటీఆర్ సిబ్బందికి మద్దతుగా, అలాగే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు మరియు శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ అరెస్టులు చేపట్టారు. పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు.