Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చాకలివానిపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

Author TELANGANA ADDA NEWS | 19 Sep 2026, 12:51 PM | Politics
చాకలివానిపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

గన్నేరువరం, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డా): గన్నేరువరం మండల కేంద్రంలోని చాకలివానిపల్లి గ్రామంలో కూన సంతోష్ ఇంటి వద్ద నుంచి తారు రోడ్డు వరకు వీఎన్‌జీ రామ్‌జీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ రేపాక బానవ్వ శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలకు సౌకర్యం కలగనుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కూన సంతోష్, పంచాయతీ కార్యదర్శి ఇట్టం రాజు, వార్డు సభ్యులు బోయిని బాలయ్య, నక్క లావణ్య, నక్క లచ్చవ్వ, బామండ్ల మల్లేశం, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూన చంద్రశేఖర్, రేపాక బాబు, బోయిని లస్మయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి