Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మాదిగలకు రాజకీయ భవిష్యత్తు శూన్యం.!

Author TELANGANA ADDA NEWS | 21 Sep 2026, 08:49 AM | Politics
మాదిగలకు రాజకీయ భవిష్యత్తు శూన్యం.!

జనాభా తమాషాన రాజకీయ ప్రాధాన్యత ఏది.?

రాజకీయ పార్టీలు ప్రతిసారి మాదిగలపై వివక్షే చూపుతున్నాయి.

ఏంఅర్పిఎస్ జిల్లా కన్వీనర్ భిక్షపతి తీవ్ర ఆరోపణ

ఇవి కూడా చదవండి

కోనరావుపేట,సెప్టెంబర్ 20(తెలంగాణఅడ్డా):

మాదిగలకు రాజకీయ భవిష్యత్తు శూన్యం,జనాభా తమాషా రాజకీయ ప్రాధాన్యత ఏదని,పార్టీలు ఏవైనా మాదిగ రాజకీయ నాయకులపై వివక్షే చూపుతున్నాయని ఏంఅర్పిఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ ఎలగందుల. భిక్షపతి అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభ ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపిన విషయం పత్రిక ప్రకటనలలో వచ్చినది అందరికి తెలిసినదే, అదేవిదంగా రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండలంలో మాదిగ జనాభ సుమారు 12 వేల మంది ఉన్నారు.అందులో రాజకీయ పార్టీలు వారికి పార్టీలో ఇచ్చే పదవులు వారికి ఇచ్చే ప్రాధాన్యత శూన్యం. ప్రతి రాజకీయ పార్టీలో మాదిగలు కార్యకర్తలుగా పార్టీ జెండాలు మోసి, గ్రామాల్లో వాళ్ళ నాయకునికోసం ఎంత దూరమైనపోయి నమ్మకంగా పార్టీ,నాయకుడి గెలుపు కోసం ఎనలేని సేవలు చేస్తారు తీరా గెలిచిన తరువాత నాయకుడు, ఆ రాజకీయ పార్టీలు మాదిగ బిడ్డలను బానిసల్ల కార్యకర్తలుగానే ఉంచుతారు.నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా ఎదగానీయారు.ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ నైన మాదిగ జాతి బిడ్డలకు ఇచ్చే రాజకీయ ప్రాధాన్యత శూన్యం.ఉదాహరణకు కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నూతనంగా గ్రామ శాఖ అధ్యక్షులు,మండల శాఖ కమిటీలు వేశారు. అందులో భాగంగా మండల ఎస్సి సెల్ అధ్యక్షులుగా గతంలో మాల సామాజిక వర్గానికి ఇచ్చారు. మళ్ళీ నూతన కమిటీ మండల ఎస్సి సెల్ అధ్యక్షులుగా మాల సామాజిక వర్గ అభ్యర్తికే ఇచ్చారు. అదేవిదంగా మండల కమిటీలో మాల సామాజిక వర్గ నాయకులకే ప్రాధాన్యత ఇచ్చారు. మండలంలో ఎక్కువగా ఉన్న మాదిగ సామజిక వర్గ నాయకులకు చోటు దక్కలేదు.మండలంలో 28 గ్రామాలు ఉంటే 21 గ్రామాల్లో మాదిగలు ఉండాగా 21 గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నియమించిన కేవలం ఒక్క గ్రామంలో మాత్రమే మాదిగ సామజిక వర్గ నాయకునికి గ్రామశాఖ అధ్యక్షపదవి దక్కింది.దానితోపాటు నిన్నటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కోనరావుపేట మండలంలో ఉన్న రెండు పాక్స్ రైతు సంఘాలకు నూతన చైర్మన్ లు డైరెక్టర్ లను నామినేటెడ్ పదవులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నియమించగా అందులో కూడా మాదిగ సామజిక వర్గ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అధికార,ప్రతిపక్ష ఏ రాజకీయ పార్టీలైన మాదిగ నాయకులకు జనాభా తమాషా ప్రకారం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మా జాతి బిడ్డలకు పదవులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా మాదిగ జాతి బిడ్డలారా ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభ ఉన్న మాదిగ జాతి బిడ్డలమైన మనం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే మనం వివిధ పార్టీల్లో బానిసల్ల ఉండడం కంటే మంద కృష్ణ మాదిగ స్థాపించిన మహాజన సోషలిస్ట్ పార్టీలోకి రావాలని, మన తలరాతలు మనమే రాసుకొని రాజకీయంగా ఎదుగుదం అని మాదిగ జాతి రాజకీయ నాయకులకు భిక్షపతి పిలుపునిచ్చారు.