Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Author TELANGANA ADDA NEWS | 21 Sep 2026, 02:59 PM | Politics
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

తెలంగాణ అడ్డా వేములవాడ: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు బాపూజీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జీ పొలాస నరేందర్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి బాపూజీ అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు బీసీలు, అణగారిన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో బాపూజీ నిరంతరం కృషి చేశారని నరేందర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు సామాజిక న్యాయం, సమన్యాయం, ఆత్మగౌరవం దక్కాలనే ఆశయంతో ఆయన పోరాటం సాగించారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అంతరించిపోతున్న కుల చేతివృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలని, కులవృత్తులపై ఆధారపడిన వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను అరికట్టాలని బాపూజీ ఆకాంక్షించారని అన్నారు. నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన ఆయన ఆశయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఏ ఉద్యమానికైనా ఏక నాయకత్వం కంటే సమిష్టి నాయకత్వమే ఆశయ సాధనకు దోహదపడుతుందని బాపూజీ విశ్వసించారని, తెలంగాణ సబ్బండ వర్గాల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పొలాస నరేందర్ అన్నారు