Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పిడుగుపాటుకు మృతి చెందిన నరేందర్ రెడ్డి కుటుంబానికి సుంకే రవిశంకర్ పరామర్శ

Author TELANGANA ADDA NEWS | 23 Sep 2026, 01:24 PM | Crime
పిడుగుపాటుకు మృతి చెందిన నరేందర్ రెడ్డి కుటుంబానికి సుంకే రవిశంకర్ పరామర్శ

పిడుగుపాటుకు మృతి చెందిన నరేందర్ రెడ్డి కుటుంబానికి సుంకే రవిశంకర్ పరామర్శ

చొప్పదండి, సెప్టెంబర్ 23 (తెలంగాణ అడ్డా):
చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గోపు నరేందర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. నరేందర్ రెడ్డి అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని సుంకే రవిశంకర్ కోరారు. పిడుగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రత కోసం అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని డిమాండ్ చేశారు.