Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బాధిత కుటుంబానికి బియ్యం, ఆర్థిక సహాయం అందజేత

Author TELANGANA ADDA NEWS | 24 Sep 2026, 04:45 PM | TELANGANA
బాధిత కుటుంబానికి బియ్యం, ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి బియ్యం, ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ అడ్డా, కోనరావుపేట:
కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామం 3వ వార్డు సభ్యుడు మొకెనపల్లి బాలరాజు తల్లి ఎల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ జిన్న అనూష అనిల్ కుమార్, పాలకవర్గ సభ్యులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, రూ.1,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లవ్వ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వాసంపెల్లి శ్రీనివాస్, జీపీఓ కనకయ్య, వార్డు సభ్యులు జాగిరి కిరణ్ గౌడ్, ఛిద్రవేణి నరేష్, జిన్న సమత అర్జున్, రేగుల పద్మ పర్శరాములు, గ్రామస్థులు పాల్గొన్నారు.