Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కొలనూరు పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఎన్నికైన ఉప్పుల గంగయ్యకు ఘన సన్మానం

Author Boini venu | 26 Sep 2026, 06:40 AM | Politics
కొలనూరు పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఎన్నికైన ఉప్పుల గంగయ్యకు ఘన సన్మానం

తెలంగాణ అడ్డా కొనరావుపేట:
కొలనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) డైరెక్టర్‌గా నూతనంగా నియమితులైన శ్రీ ఉప్పుల గంగయ్యను సుద్దాల గ్రామపంచాయతీ 6వ వార్డుకు చెందిన మిత్రులు, స్నేహితులు మరియు బంధువులు ఘనంగా సత్కరించారు. 
ఈ సందర్భంగా వారు గంగయ్య నివాసానికి చేరుకుని, ఆయనకు శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మిత్రులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన వ్యక్తి సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా, సామాజికంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తూ, సహకార రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో సుద్దాల గ్రామపంచాయతీ 6వ వార్డుకు చెందిన మిత్రులు, స్నేహితులు, బంధువులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగయ్యకు అభినందనలు తెలిపారు.