Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అండర్-17 బాలికల కబడ్డీలో కిరణం ది హైస్కూల్ విజయకేతనం జిన్నారం మండల స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినీలు

Author TELANGANA ADDA NEWS | 28 Sep 2026, 07:29 PM | Sports
అండర్-17 బాలికల కబడ్డీలో కిరణం ది హైస్కూల్ విజయకేతనం  జిన్నారం మండల స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినీలు

జిన్నారం, తెలంగాణ అడ్డా:
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిన్నారం మండలంలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన అండర్-17 బాలికల కబడ్డీ పోటీల్లో కిరణం ది హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన పోటీల్లో కిరణం పాఠశాల విద్యార్థినీలు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయకుమార్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విజయం సాధించిన విద్యార్థినీలకు నిరంతరం శిక్షణ అందించిన పీఈటీలు, ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

కిరణం ది హైస్కూల్ కరస్పాండెంట్ నాగబాబు మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని తెలిపారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కార్యక్రమంలో బొల్లారం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కే. ప్రభుకుమార్, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజేత విద్యార్థినీలను అభినందించారు.