Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సింగారం పంచాయతీలో సమస్యలపై బీఆర్ఎస్ నిరసన...

Author | 30 Sep 2026, 02:37 PM | Politics
సింగారం పంచాయతీలో సమస్యలపై బీఆర్ఎస్ నిరసన...

భారీ ర్యాలీగా వెళ్లి పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపిన టిఆర్ఎస్ నాయకులు.



తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

సింగారం పంచాయతీలో సమస్యలపై బీఆర్ఎస్ నిరసన... - Additional Image

ఇవి కూడా చదవండి


మణుగూరు సమితి సింగారం గ్రామ పంచాయతీలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీగా మహిళలకార్యకర్తలు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, మండల పార్టీ అధ్యక్షులు కురి నాగేశ్వరరావు మాట్లాడు తూ..గ్రామంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోయి, పంచాయతీని మురికి కూపంగా మార్చారని నాయకులు ధ్వజమెత్తరు. చెత్తను ఎత్తే పరిస్థితి కూడా లేకపోవడం తో, పందుల సంచారం, మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.మణుగూరు మేజర్ పంచాయతీ అయినా సమితి సింగారంలో పారిశుద్ధ్యం పూర్తిగా విఫలమైందని, తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పంచాయతీలో పారిశుద్ధ్యంపై పాలకవర్గం దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ నాయకులు హెచ్చరించారు.