Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా

Author TELANGANA ADDA NEWS | 05 Oct 2026, 07:37 PM | Politics
కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా

సుల్తానాబాద్ తెలంగాణ అడ్డా ప్రతినిధి: స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ ముద్దుబిడ్డ కాకా గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని కాకా వెంకటస్వామి విగ్రహానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ రమేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినపల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, జానీ, కౌన్సిలర్లు రాయమల్లు, గరిగే శోభా శ్రీనివాస్, తిరుపతి, అమ్మిరిశెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయక్ దామోదర్ రావు, పన్నాల రామన్న, అప్పల తిరుమల, రఫిక్, రాహుల్, కాకా అభిమానులు, సర్పంచులు చిలుక సతీష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి