Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్‌కు కలెక్టర్ ప్రశంసాపత్రం

Author TELANGANA ADDA NEWS | 09 Oct 2026, 11:08 AM | Politics
సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్‌కు కలెక్టర్ ప్రశంసాపత్రం

సర్పంచుల సేవలకు గుర్తింపుగా ప్రశంస

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేత

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా సేవలు

అభినందనలు తెలిపిన పలువురు నాయకులు

ఇవి కూడా చదవండి

తెలంగాణ అడ్డా ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. జిల్లాలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ ప్రశంసాపత్రం అందజేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేయడం వంటి అంశాల్లో చురుకుగా పనిచేస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్నట్లు ఏటీ యాదవ్ తెలిపారు. తన సేవలను గుర్తించి ప్రశంసాపత్రం అందించిన జిల్లా కలెక్టర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ గుర్తింపు భవిష్యత్తులో మరింత బాధ్యతతో ప్రజలకు, గ్రామాల అభివృద్ధికి సేవలందించేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఏటీ యాదవ్‌కు అభినందనలు తెలిపారు.