Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉద్యమ నేత ఎడ్ల శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు...

Author | 11 Oct 2026, 05:35 PM |
ఉద్యమ నేత ఎడ్ల  శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు...

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన యోధుడు జాతిపిత మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నూతనంగా ఏర్పాటు చేసి పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసన సభ్యులు రేగా కాంతారావు,నాటి టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు,గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ చేతుల మీదుగా గత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ నేత మణుగూరు మండల నాటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షు లు,ప్రస్తుత బీ ఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్ ను శాలువా కప్పి,పుష్పగుచ్చం చేతికి అందించి ఘనంగా సత్కరించారు. మణుగూరు పట్టణంలోని హనుమాన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యవ సర సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏడు మండలాల నుంచి మాజీ జెడ్పిటిసిలు సర్పంచులు, మండల నాయకులు కార్యకర్తలు వందల దిగా హాజరైనారు.ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన సంద ర్భంగా గ్రాడ్యుయేట్ అభ్యర్థుల ఎన్రోల్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది.ఈ నేపథ్యం లో గత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్య మించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారులను ఈ సందర్భంగా ఘనంగా సత్క రించారు.దాదాపు 40 మంది ఉద్యమ కారులను వేదిక మీద ఆహ్వానించి శాలు వా,పూలతో ఘనంగా సన్మా నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటాలు చేసిన ఉద్యమ కారులను గుర్తించి,దశాబ్ద కాల ఉత్సవాలలో శాలువాలతో సన్మా నించడం ఆనందించదగ్గ విషయమని సన్మాన గ్రహీతలు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, నాటి ఉద్యమ నేత సీనియర్ నాయకులు దిండిగాల రాజేందర్ లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.