Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన మణుగూరు ఏరియా ఆసుపత్రి....

Author | 17 Oct 2026, 06:30 AM |
రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన మణుగూరు ఏరియా ఆసుపత్రి....

వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని అభినందించిన పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన మణుగూరు ఏరియా ఆసుపత్రి.... - Additional Image

కాయకల్ప, అంచనా కార్యక్రమంలో మణుగూరు ఏరియా ఆసుపత్రి చారిత్రా త్మక విజయాన్ని సాధించింది.తొలిసారిగా ఈ అంచనా కార్యక్రమం లో పాల్గొన్న మణుగూరు ఏరియా ఆసుపత్రి, మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి అవార్డును కైవసం చేసు కోవడం అభినందనీయమని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన మణుగూరు ఏరియా ఆసుపత్రి మాజీ మెడికల్ సూపరిం టెండెంట్ డాక్టర్ ముత్తేనాని గౌరీ ప్రసాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వ కంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించి,ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి గుర్తింపు తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఆసుపత్రు ల్లో పరిశుభ్రత,పారిశుద్ధ్యం రోగులకు మెరు గైన వైద్య సేవలు, ఆసుపత్రి పరిసరాల నిర్వహణ,నాణ్యమైన వైద్య సదుపాయాల కల్పన వంటి అంశాలకు కాయకల్ప కార్య క్రమం ఎంతో ప్రాధాన్యతని స్తుందని ఎమ్మె ల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తొలిసా రిగా పాల్గొని,మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర స్థాయి అవార్డును సాధించడం వైద్యు లు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందిఅంకితభా
వానికి, సమిష్టి కృషికి నిదర్శనమని కొని యాడారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుప త్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.మణుగూరు ఏరియా ఆసుపత్రి భవిష్యత్తులోనూ మరి న్ని విజయాలు సాధించి,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించా రు.మణుగూరు ఏరియా ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన మాజీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ముత్తే నాని గౌరీ ప్రసాద్,నర్సింగ్ సిబ్బంది మరి యు ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యేపాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక అభినందనలు తెలి యజేశారు.

ఇవి కూడా చదవండి