Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి

Author TELANGANA ADDA NEWS | 17 Oct 2026, 10:50 AM | Bhakti
ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి  మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి

తెలంగాణ అడ్డా ఆలేరు ప్రతినిధి

బతుకమ్మ, దసరా పండుగలు ప్రకృతితో మనకున్న విడదీయలేని అనుబంధానికి ప్రతీకలని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, సంప్రదాయాలను గౌరవిస్తూ జరుపుకునే ఈ పండుగలు మన సంస్కృతిలో ప్రకృతికి ఉన్న విశిష్ట స్థానాన్ని చాటిచెబుతాయని పేర్కొన్నారు.

బతుకమ్మలో పూలను పూజించడం, విజయదశమి సందర్భంగా జమ్మిచెట్టును ఆరాధించడం మన సంప్రదాయాల్లో ప్రకృతికి ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి స్ఫూర్తితో పర్యావరణానికి హాని కలిగించే అలవాట్లపై కూడా విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

పండుగల స్ఫూర్తితో ప్రకృతిని కాపాడుకుంటూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని మంజుల పత్తిపాటి సూచించారు.