Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేత...

Author | 17 Oct 2026, 02:49 PM |
వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేత...

ప్రజా సేవే లక్ష్యంగా, పేదల సంక్షేమమే ధ్యేయం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

పేద,ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ, మెరుగైన వైద్య చికిత్స అందించేందు కు పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లు తనవంతు సహకారం అందిస్తున్నా రు.ఇందులో భాగంగా అశ్వాపురం మండ లం, అశ్వాపురం గ్రామానికి చెందిన రాంపూడి నాగమణికి వైద్య చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ( ఎల్ వో సి ) ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం అందజేశారు.ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ,పేద ప్రజలకు అండగా నిలవడం,ఆపద సమయం లో వారికి సహాయ సహకారాలు అందించడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని పేర్కొన్నా రు.ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరికీ వైద్య చికిత్సకు ఆటంకం కలగకూడదనే ఉద్దే శంతో అర్హులైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నామ ని తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రాధా న్యతనిస్తూ, అర్హు లైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయో జనాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొ న్నారు.నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ,వారి సమస్యల పరిష్కా రానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పేద కుటుంబాలకు వైద్య పర మైన ఆర్థిక భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉప యోగ కరంగా నిలుస్తోందని,అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి