Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బోయినిపల్లి ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక

Author TELANGANA ADDA NEWS | 18 Oct 2026, 03:37 PM | Bhakti
బోయినిపల్లి ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు  తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక

*పండుగను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

*ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు

*కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలుపుల ప్రవీణ్

బోయిన్పల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి

ఇవి కూడా చదవండి

బోయినిపల్లి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు కొలుపుల ప్రవీణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు.

తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల ఐక్యతకు, సంస్కృతి వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.

పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మేడిపల్లి సత్యం అన్న అవసరమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు. సద్దుల బతుకమ్మను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

బోయినిపల్లి మండల ప్రజలందరి జీవితాల్లో సద్దుల బతుకమ్మ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని కొలుపుల ప్రవీణ్ ఆకాంక్షించారు.