Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రత్నంపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Author TELANGANA ADDA NEWS | 18 Oct 2026, 07:15 PM | Bhakti
రత్నంపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

బోయిన్పల్లి తెలంగాణ అడ్డా
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళల ఆటపాటలు, బతుకమ్మ పాటలతో సందడి నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్థులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.