Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

స్తంభంపల్లి హైస్కూల్‌లో మినీ కిచెన్ గార్డెన్ ప్రారంభం

Author Boini venu | 26 Oct 2026, 06:29 PM | Politics
స్తంభంపల్లి హైస్కూల్‌లో మినీ కిచెన్ గార్డెన్ ప్రారంభం

విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం

తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలోని హైస్కూల్ ఆవరణలో మినీ కిచెన్ గార్డెన్‌ను గ్రామ సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ ప్రారంభించారు. హిందీ పండిట్ రాముల సతీష్ కుమార్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఈ కూరగాయల తోట విద్యార్థుల్లో మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడనుంది.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో మినీ కూరగాయల తోట ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని అన్నారు. ఈ తోట ద్వారా విద్యార్థులు కూరగాయల సాగు, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. పుస్తకాల ద్వారా పొందే విద్యతో పాటు, ఆచరణాత్మక అనుభవం విద్యార్థుల అభ్యసనకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిపై ప్రేమ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడం అవసరమని అన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తినివ్వడంతో పాటు పాఠశాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

తన సొంత ఖర్చులతో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసిన హిందీ పండిట్ రాముల సతీష్ కుమార్‌ను సర్పంచ్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల ప్రయోజనం కోసం ఉపాధ్యాయులు చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, ప్రాథమిక, ప్రీ-ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు, వార్డు సభ్యుడు అక్కనపల్లి మధుకర్, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.