Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గుండన్నపల్లిలో నూతన బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

Author TELANGANA ADDA NEWS | 27 Oct 2026, 09:03 AM | Politics
గుండన్నపల్లిలో నూతన బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి, తెలంగాణ అడ్డా ప్రతినిధి:

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే నేపథ్యంలో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాత్రి 10:30 గంటల సమయంలో బోయినపల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో నూతన బోర్‌వెల్ పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.

ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, సమయంతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టడంపై దృష్టి సారించారు.

ఇవి కూడా చదవండి