Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కరీంనగర్ పౌరసరఫరాల కార్యాలయంలో విజిలెన్స్ మెరుపు దాడి

Author Karimnagar | 03 Nov 2026, 10:49 PM | TELANGANA
కరీంనగర్ పౌరసరఫరాల కార్యాలయంలో విజిలెన్స్ మెరుపు దాడి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

బాధితుడి ఫిర్యాదుతో ఆకస్మిక తనిఖీలు చేసిన విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం

కీలక దస్త్రాలు స్వాధీనం.. CMR బియ్యం బకాయిల వేళ అధికారుల తనిఖీలతో కలకలం

ఇవి కూడా చదవండి

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు మంగళవారం హఠాత్తుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ బాధితుడి నుంచి వచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో పౌరసరఫరాల కార్యాలయానికి సంబంధించిన పలు కీలక దస్త్రాలు (Files/Records) మరియు రికార్డులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దస్తావేజులను నిశితంగా పరిశీలిస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తనిఖీల్లో పాల్గొన్న అధికారులు మీడియాకు తెలియజేశారు.

ప్రాధాన్యత సంతరించుకున్న తనిఖీలు

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) బకాయిలకు సంబంధించి ఇప్పటికే పలువురు రైస్ మిల్లర్లపై కేసులు నమోదు కావడం, అరెస్టుల పర్వం కొనసాగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు నేరుగా ఆకస్మిక సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర రాజకీయ, పరిపాలనా ప్రాధాన్యతను సంతరించుకుంది. పౌరసరఫరాల శాఖ అధికారుల తీరుపై కూడా నిఘా పెరిగినట్లు ఈ తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి.