Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు తుగ్లక్ సైతం సిగ్గుపడేలా ఉన్నాయి

Author TELANGANA ADDA NEWS | 04 Sep 2026, 03:24 PM |
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు  తుగ్లక్ సైతం సిగ్గుపడేలా ఉన్నాయి

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు తుగ్లక్ సైతం సిగ్గుపడేలా ఉన్నాయి

ప్రభుత్వ నిర్ణయాల్లో పొంతన లేదు.. టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ సైతం సిగ్గుపడే పరిస్థితి ఉందని టీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి ఒకటి చెబుతుంటే.. ప్రభుత్వ శాఖలు మరోలా ప్రకటనలు చేయడం రాష్ట్రంలో పాలనా గందరగోళానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు.

ఇంటర్మీడియేట్ ప్రవేశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు తీసుకోబోమని చెబుతున్నారని, అయితే కేవలం రెండు రోజుల్లోనే ఇంటర్మీడియేట్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటనలు జారీ చేయడం ఏమిటని కవిత ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చెప్పే మాటలకు, ప్రభుత్వ శాఖలు విడుదల చేసే ప్రకటనలకు ఎలాంటి పొంతన లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత కొరవడిందని, ప్రజలు అయోమయానికి గురయ్యేలా పరిస్థితులు మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలు గందరగోళంగా మారాయని పేర్కొన్న కవిత.. ముఖ్యమంత్రి, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.