Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

Author TELANGANA ADDA NEWS | 05 Sep 2026, 08:30 PM |
 అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి.. పెద్దపల్లిలో ఘనంగా సంబరాలు

పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో పట్టణంలోని చీకురాయి రోడ్డు నుంచి జెండా చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు.

రైతుల నుంచి గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సన్నధాన్యానికి బోనస్ చెల్లించగా, పెద్దపల్లి నియోజకవర్గంలోని రైతులకు మాత్రమే రూ.80.68 కోట్ల బోనస్ అందించినట్లు వెల్లడించారు. వరంగల్ డిక్లరేషన్ హామీ మేరకు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి, తిరిగి బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం కల్పించామని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనపై విమర్శలు

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడైనా ఒక్క రైతుకైనా ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేశారా అని విజయరమణ రావు ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని, పేదలకు గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా, తొలి విడతలో 3 వేల ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరో పది రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.

పెద్దపల్లిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం

పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.88 కోట్లు, భూసేకరణ కోసం మరో రూ.80 కోట్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా ఆసుపత్రిని 100 పడకలకు విస్తరించడంతో పాటు రూ.53 కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆర్డీవోబీ పనులు నత్తనడకన సాగుతుంటే, పెద్దపల్లిలో మాత్రం ఆర్డీవోబీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. మరో రెండు, మూడు నెలల్లో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

కేటీఆర్‌పై మండిపాటు

మహిళా సంఘాలకు గతంలో రూ.3,100 కోట్ల వడ్డీ బకాయిలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విజయరమణ రావు విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజలు ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని విజయరమణ రావు స్పష్టం చేశారు.