Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

Author TELANGANA ADDA NEWS | 06 Sep 2026, 03:15 PM |
మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

పర్యావరణ పరిరక్షణకు విత్తన గణపతి ఎంతో ఉపయోగకరం

మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

చొప్పదండి ప్రతినిధి / తెలంగాణ అడ్డా

మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రూపొందించిన విత్తన గణపతిని చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు అందజేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జోగినిపల్లి సంతోష్‌కుమార్ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని చేస్తున్న అవగాహన కార్యక్రమం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విత్తన గణపతిలో వివిధ రకాల విత్తనాలను పొందుపరిచారని, వినాయక నవరాత్రులు పూర్తయిన అనంతరం గణపతిని మట్టిలో ఉంచితే అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదిగేలా రూపొందించారని తెలిపారు. ఆ మొక్కలను ఇంటి ఆవరణలో నాటుకోవడంతో పర్యావరణానికి మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, భావితరాలకు ఆరోగ్యకరమైన, పచ్చని భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలని సుంకే రవిశంకర్ కోరారు. విత్తన గణపతిని పంపించిన జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కమల్‌గౌడ్‌, చొప్పదండి నియోజకవర్గ హరిత సేన అధ్యక్షులు మామిడి అఖిల్‌, రామడుగు మండల అధ్యక్షులు మధు, నాయకులు కన్నం సాగర్‌, వేముల రాజు, గంటి రాజు తదితరులు పాల్గొన్నారు.