Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ మహాధర్నా

Author TELANGANA ADDA NEWS | 12 Sep 2026, 04:22 PM |
దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ మహాధర్నా

దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ మహాధర్నా

శనిగరం కూడలిలో 500 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ఆందోళన

దళిత వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్‌ను తెలంగాణ సమాజం తరిమికొట్టాలి: కాంగ్రెస్ నాయకుల పిలుపు

కమలాపూర్, సెప్టెంబర్ 12 (తెలంగాణ అడ్డా న్యూస్):

ఇవి కూడా చదవండి

శాసనసభ స్పీకర్, దళిత నేత గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కమలాపూర్ మండలం శనిగరం గ్రామ కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీఆర్ఎస్ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దళితుల పట్ల బీఆర్ఎస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్‌ను తెలంగాణ సమాజం తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ పదవులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

ఈ మహాధర్నాలో డీసీసీ ఇన్‌ఛార్జీలు పాడి కల్పన, రాజేశ్వరరావు, ముఖ్య నాయకులు తౌటం రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, డాక్టర్ మౌటం కుమారస్వామి, తడక శ్రీకాంత్, మాట్ల రమేష్, బొల్లం రాజిరెడ్డి, విష్ణుదాసు వంశీధర్ రావు, ఆడెపు విజయ, పుల్ల శోభన్, రెక్కల నారాయణరెడ్డి, గూడెపు మొగిలయ్య, నాంపల్లి ప్రభాకర్, జనగాని శివకృష్ణ, గట్టు శ్రీధర్, నెగ్గుల లింగయ్య, మాట్ల కళ్యాణ్, కొండ తిరుపతి, పరశురాములు, పల్లె సమ్మిరెడ్డి, దూడ శ్రీకాంత్ రెడ్డి, గాలిబు నవీన్, భాషబోయిన రమేష్, తాటిపాముల రాములు, పూజారి రమేష్, పైసా శరత్, చేరాల రోహిత్, దేశిని ప్రవీణ్, అబ్బరవేణి అనిల్, శనిగరపు రమేష్, గంధసిరి అనిల్, మౌటం నాగరాజు, జన్ను బిక్షపతి, వసంతరావు, వీరేశం తదితరులు పాల్గొన్నారు.