Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉపాధ్యాయులను గౌరవిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది.. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్

Author TELANGANA ADDA NEWS | 05 Sep 2026, 08:59 PM |
ఉపాధ్యాయులను గౌరవిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది.. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్

ఉపాధ్యాయులను గౌరవిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది.. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట ప్రతినిధి / తెలంగాణ అడ్డా

చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్త్యాల తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఉపాధ్యాయులను గౌరవించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని సీపీ పేర్కొన్నారు.
యువతులు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలని, ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని సూచించారు. సమాజంలో ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే షీ టీమ్స్‌కు సమాచారం అందించాలని భరోసా కల్పించారు.
ఆన్‌లైన్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ—ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు (OTP), వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి