Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జిన్నారం మున్సిపల్‌లో కాంగ్రెస్‌ 420 హామీల బాకీ కార్డుల పంపిణీ

Author TELANGANA ADDA NEWS | 06 Sep 2026, 02:36 PM |
జిన్నారం మున్సిపల్‌లో కాంగ్రెస్‌ 420 హామీల బాకీ కార్డుల పంపిణీ

జిన్నారం మున్సిపల్‌లో కాంగ్రెస్‌ 420 హామీల బాకీ కార్డుల పంపిణీ

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
జిన్నారం మున్సిపల్‌ బీఆర్ఎస్‌ నాయకుల డిమాండ్‌

జిన్నారం ప్రతినిధి / తెలంగాణ అడ్డా

ఇవి కూడా చదవండి

జిన్నారం మున్సిపల్‌ పరిధిలోని నల్తూర్‌, కొడకంచి, ఉట్ల, దాదిగూడెం, మంగంపేట, జంగంపేట గ్రామాల్లో బీఆర్ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన 420 బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేస్తూ ఇంటింటికీ బాకీ కార్డులు పంపిణీ చేసి నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్‌ చైర్మన్‌ జనార్దన్‌, సీనియర్‌ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాయకోటి రాజేష్‌, కౌన్సిలర్లు పూజారి రాజు, నాగరాజు, బత్తుల మహేష్‌, ఆది రామకృష్ణ, శంకరప్ప, శివరాజు, శ్రీశైలం, మల్లేశం, నరేందర్‌, గోవిందరాజు, రాజు, కృష్ణ, భీమ్రావు, కుమార్‌, వెంకటేష్‌, భాస్కర్‌, సాయి గౌడ్‌, నాగరాజు, వీరేష్‌, బిక్షపతి, మల్లేష్‌, మహేష్‌, విష్ణు, శ్రీకాంత్‌, సత్యనారాయణతో పాటు బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.