Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు

Author TELANGANA ADDA NEWS | 06 Sep 2026, 05:17 PM |
మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు

మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు

హైదరాబాద్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన సమాచారం కలకలం రేపింది. తనకు న్యాయం జరగడం లేదని, ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఆమె ఈ నిర్ణయానికి పాల్పడినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించిన మాధురి రాథోడ్‌ను గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాధురి రాథోడ్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని ఆమె ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కూడా మాధురి ఆరోపించినట్లు సమాచారం.

కాగా, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌కు సంబంధించిన వివాదం కొంతకాలంగా కొనసాగుతోంది. వీరిద్దరికి సంబంధించిన కొన్ని వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై ఇరువైపులా భిన్నమైన వాదనలు వినిపించాయి.

మాధురి రాథోడ్ చేసిన ఆరోపణలపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలు తెలియాల్సి ఉంది.