Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అబ్దుల్ జమీల్

Author Mohammad azeem | 06 Sep 2026, 09:29 PM |
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అబ్దుల్ జమీల్

జగిత్యాలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అబ్దుల్ జమీల్

జగిత్యాల బ్యూరో / తెలంగాణ అడ్డా

ఇవి కూడా చదవండి

జగిత్యాల జిల్లా కేంద్రంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో భాగంగా పీఆర్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు, జెడ్పీహెచ్‌ఎస్ నూకపల్లి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ జమీల్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.

జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అబ్దుల్ జమీల్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విద్యాబోధనలో ఆయన చూపుతున్న ప్రతిభ, విద్యార్థుల విద్యాభివృద్ధి, భవిష్యత్‌ కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా అవార్డు అందుకున్న అబ్దుల్ జమీల్‌ను తోటి ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పలువురు ప్రముఖులు అభినందించారు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.