Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

11 మంది అధికారులు హాజరు.. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ

Author TELANGANA ADDA NEWS | 07 Sep 2026, 09:00 PM |
11 మంది అధికారులు హాజరు.. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ

వీర్నపల్లిలో ప్రజావాణి.. 9 అర్జీల స్వీకరణ

11 మంది అధికారులు హాజరు.. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ

వీర్నపల్లి, తెలంగాణ అడ్డా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల స్థాయిలో వికేంద్రీకరించడంలో భాగంగా వీర్నపల్లి మండల ప్రజాపరిషత్ (MPP) కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన 11 మంది అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలను స్వీకరించారు. మొత్తం 9 అర్జీలు అందగా.. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గ్రామీణ సమస్యల పరిష్కారానికి వేదిక

ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

త్వరిత పరిష్కారానికి చర్యలు

ఈ సందర్భంగా వీర్నపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) శ్రీమతి బాజోజి శ్రీలేఖ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన 9 అర్జీలను వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.